Bigg Boss Telugu: బిగ్ బాస్ 9 షోలో మీరు ఆడాలనుకుంటే.. సింపుల్ ఇలా చేయండి.. రిజిస్టర్ లాగిన్ మీ కోసం

Bigg Boss Telugu
Bigg Boss Telugu

Bigg Boss Telugu: బుల్లితెర మీద ప్రచారం అయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ప్రత్యేక ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ చేసుకొని ఒక త్వరలో సీజన్ 9 లోకి అడుగుపెడుతుంది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియోతో ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ ప్రకటనలో హోస్టుగా మరోసారి అక్కినేని నాగార్జున ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ పంచ్ డైలాగులు కూడా చేశారు. బిగ్బాస్ టీం రీసెంట్గా కాల్ ఫర్ ఎంట్రీస్ అనే పేరుతో ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

ఈ వీడియోలో కామన్ ఆడియన్స్ను కూడా కంటెస్టెంట్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి బిగ్ బాస్ ని ఇష్టపడే ప్రేక్షకులు హౌస్ లోకి కంటెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని వీడియోలో నాగార్జున తెలిపారు. అంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీలతోపాటు కామన్ ఆడియన్స్ కూడా హౌస్ లోకి వెళ్ళవచ్చు. దీనికోసం www.bb9.jiopstar.com లో రిజిస్టర్ కావాలి. బిగ్ బాస్ హౌస్ లోకి మీరు పార్టిసిపేట్ చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ ఒక వీడియోను అప్లోడ్ చేస్తే సరిపోతుంది.

గతంలో కూడా ఇదేవిధంగా బిగ్బాస్ హౌస్లో కామన్ ఆడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈసారి రాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా సెలబ్రిటీలతో పాటు కామన్ ఆడియన్స్ కి కూడా హౌస్ లో పాటిస్పేట్ చేయడానికి బిగ్బాస్ టీం అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని పొందడానికి మీరు మీకు సంబంధించిన ఒక వీడియోను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now