TG INTER RESULTS 2025: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22 మంగళవారం రోజున విడుదల కానున్నాయి. హైదరాబాద్ నాంపల్లి లోని విద్యా భవన్ లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను ప్రకటించబోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య ఇంటర్ ఫలితాల విడుదల తేదీ మరియు సమయం అధికారికంగా ప్రకటించారు. మరికొన్ని గంటలలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇప్పటికే ఇంటర్ బోర్డు దీనికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 22 మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నాంపల్లి లోని విద్యా భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతులమీదుగా ఇంటర్ ఫలితాలను ప్రకటించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య దీనికి సంబంధించి తాజాగా ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ మరియు సమయాన్ని ఖరారు చేశారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటర్ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ లో (https://tgbie.cgg.gov.in/) ఫలితాలను నేరుగా చూసుకోవచ్చు.
అలాగే ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఐవిఆర్ పోర్టల్ 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి ఐదు నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1532 కేంద్రాలలో మొత్తం 9.50 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. వీళ్లలో 4.8 లక్షల మంది మొదటి సంవత్సరం విద్యార్థులు అలాగే ఐదు లక్షల పైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత మొత్తం 19 సెంటర్లలో మార్చి 19 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఏప్రిల్ 10వ తేదీతో ముగిసింది.