Investment Plan: అద్భుతమైన స్కీమ్.. రూ. 4వేలు ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ టైం వరకు 60 లక్షలు రిటర్న్..
తాము సంపాదించిన సంపాదనలో పిల్లల భవిష్యత్తు కోసం దాచాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. దీనికోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అందులో కొందరు భూమిపై మరికొందరు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూ తాము పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలని సహజంగానే ఆశపడుతుంటారు. ఈ రోజుల్లో పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలంటే మ్యూచువల్ ఫండ్స్, ఇంగ్లీష్ మెంట్ ఫండ్ పై పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చెబుతున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు పొందడానికి సిస్టం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక మంచి ప్లాట్ ఫాం గా చెప్పవచ్చు.
ప్రతినెల ₹ 4వేల రూపాయల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్
మీరు సంపాదించిన సంపాదనలో ప్రతినెల ₹ 4వేల రూపాయలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో ప్రతినెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ను ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో దాదాపు 60 లక్షల రూపాయల వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 4వేల రూపాయలు ప్రతినెల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సంవత్సరానికి 48 వేల రూపాయలు అదే 24 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ₹ 11, 52,000/- రూపాయలు అవుతాయి. మార్కెట్ విలువ ప్రకారం సగటున 12 శాతం వడ్డీ చొప్పున గణాంకాలు చూసినట్లయితే మీరు పెట్టే మొత్తం పెట్టుబడిపై 60 లక్షల 33 వేల 715 రూపాయల రిటర్న్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా 5 రెట్ల కంటే ఎక్కువ డబ్బు మనం పెట్టిన పెట్టుబడికి కలిసి వస్తుంది.
ఒకసారి చేసిన ఈ ఇన్వెస్ట్మెంట్ 24 సంవత్సరాల పాటు ఉంచాలి, మధ్య మధ్యలో డబ్బులు తీసుకోకుండా అలాగే మ్యూచువల్ ఫండ్ SIP లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం పెట్టిన పెట్టుబడి వడ్డీకి వడ్డీ కలిసొస్తూ మంచి లాభాలు గడించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడి భవిష్యత్తులో మంచి స్థిర ఆదాయంతో పాటు భవిష్యత్తుకు భద్రత ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పై తమకి తాముగా ఆసరాగా ఉండడానికి ఇలాంటి స్కీమ్స్ వైపు దృష్టి సారిస్తారు.
SIP లో పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్
కానీ ఇలాంటి మ్యూచువల్ ఫండ్ SIP లో పెట్టుబడులను పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తే వారు పెరిగి పెద్దయ్యేసరికి వారి చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు మధ్యతరగతి కుటుంబాల వారికి ఆసరాగా ఉంటుందని నిపుణుల సూచన. ఈ రోజుల్లో విదేశీ విద్యను అభ్యసించడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. వారికోసం బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరగకుండా చిన్న వయసులోనే పిల్లలపై పెట్టిన మ్యూచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్మెంట్ తో వారిని విదేశాలకు చదువుల నిమిత్తం పంపించడానికి కూడా ఈ పెట్టుబడి సహాయపడుతుంది.
SIP అంటే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్ లో ఒకసారి డబ్బు ఇన్వెస్ట్ చేశాక మర్చిపోవాలని, మెచ్యూరిటీ టైం వరకు పెట్టిన పెట్టుబడి 5రెట్లు అవుతుందని వారి అభిప్రాయం. కానీ డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి ఫండ్ ఎంచుకుంటున్నారు, గతంలో దాని మార్కెట్ వ్యాల్యూ ఎలా ఉంది, అనుభవం తదితర మార్కెట్ విలువను బట్టి మంచి మ్యూచువల్ ఫండ్ SIP నీ ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి మార్కెట్లో మంచి మ్యూచువల్ ఫండ్ SIP లో ఇన్వెస్ట్ చేయాలని డబ్బు ఇన్వెస్ట్ చేసేముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన. గమనిక కేవలం మార్కెట్లో నడుస్తున్న మ్యూచువల్ ఫండ్ ఫై ప్రస్తుత ఇన్వెస్ట్మెట్ ఆలోచన విధానానికి ఈ ఆర్టికల్ ఒక ఉదాహరణ మాత్రమే.