Pan Card: పాన్ కార్డ్ వ్యాలిడిటీ 10 ఏళ్ళు మాత్రమేనా?.. వెంటనే ఈ విషయం తెలుసుకోని జాగ్రత్త పడండి.. లేకపోతే రూ.10 వేలు జరిమానా తప్పదు

Pan Card
Pan Card

Pan Card: ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాలలో పాన్ కార్డు వ్యాలిడిటీ 10 ఏళ్ళు మాత్రమే ఉంటుందని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనదేశంలో డబ్బుకు సంబంధించి ఏ విధమైన లావాదేవీలు చేయాలన్నా కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ లు, ప్రాపర్టీ కొనుగోలు చేయడం, టాక్సీ ఫైలింగ్ ఇలా ప్రతిదానికి కూడా పాన్ కార్డు తప్పనిసరిగా అడుగుతారు. కానీ మన దేశంలో ఉన్న కొంతమందికి పాన్ కార్డు గురించిన ఉపయోగాలు సరిగ్గా తెలియవు అని చెప్పాలి. కొంతమంది సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న రూమర్స్ మరియు ఫేక్ ఇన్ఫర్మేషన్ వంటి వాటిని నమ్మి చాలా ఆందోళన చెందుతున్నారు.

కొంతమంది పాన్ కార్డుకు కూడా వ్యాలిడిటీ ఉంటుందని అది కేవలం 10 ఏళ్ళు మాత్రమే అని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఆధార్ కార్డులో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పేరు మరియు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని రూల్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి పది ఏళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలని యు ఐ డి ఏ ఐ సిఫార్సు చేస్తుంది.

అయితే ఈ మధ్యకాలంలో పాన్ కార్డుకు కూడా ఇదే రూల్ ఉంది అనే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అవి ఏమాత్రం నిజం కాదు. పాన్ కార్డుకు ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు. పాన్ కార్డులో పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ గడువు ముగింపు అనేది ఉండదు. లైఫ్ టైం వరకు ఈ నెంబర్ అలాగే ఉంటుంది. కావాలంటే మీరు పాన్ కార్డులో ఉన్న అడ్రస్ లేదా వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఒక వ్యక్తికి ఇచ్చిన పాన్ కార్డు నెంబర్ మాత్రం జీవితాంతం వరకు శాశ్వతంగా ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now