UPI: ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో ఉద్యోగం చేసే చాలామంది క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డు ను ఉపయోగించడం వలన రివార్డు పాయింట్లతో పాటు తర్వాత చెల్లించే సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. కానీ చిన్న చిన్న దుకాణాలలో మాత్రం క్రెడిట్ కార్డు స్వైప్ చేసే అవకాశం ఉండదు. ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్ కంటే కూడా రూపే కార్డు బాగా ప్రజాదారణ పొందింది. యూపీఐ కి రూపే కార్డును లింక్ చేయడం వలన చిన్న చిన్న దుకాణాలలో కూడా సులభంగా చెల్లింపు చేసుకోవచ్చు.
అన్ని చెల్లింపులకు కూడా రూపే కార్డు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులతో పోల్చినట్లయితే రూపాయి క్రెడిట్ కార్డుకు యూపీఐ ద్వారా లింక్ చేయడం వలన ఎక్కడైనా సరే సులభంగా చెల్లింపు చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్ కు సంబంధించి ఎప్పుడో అవకాశాన్ని కల్పించడం జరిగింది. యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డుని లిడ్ చేయడం వలన అన్ని క్రెడిట్ కార్డుల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.
చిన్న చిన్న దుకాణాలలో సైతం రూపే క్రెడిట్ కార్డు ఉపయోగించి సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై నెల 2022 నుంచి యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డును ఉపయోగించే అనుమతిని ఇచ్చింది. అయితే ఈ విసులుబాటు నాన్ రూపే క్రెడిట్ కార్డులకు లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా రూపే క్రెడిట్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆకర్షణీయంగా మారాయి. దీంతో అదనపురూపే కార్డులను కూడా బ్యాంకులు ఇవ్వడం మొదలుపెట్టాయి. దేశంలో కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సొంత రూపే కార్డులను అలాగే కోబ్రాండెడ్లను జారీ చేస్తున్నాయి.