Bird Superstition: పక్షులలో కొన్ని పక్షులను అత్యంత శుభప్రదంగా భావిస్తే మరి కొన్ని పక్షులను మాత్రం చాలా అశుభంగా భావిస్తారు. ఈ పక్షి అరుపును అనుకొని సంఘటనల సంకేతంగా కూడా పరిగణిస్తారు. ఈ పక్షి అరుపు ఏ ఇంటి మీద వినిపిస్తే ఆ ఇంట్లో అన్ని కలహాలు మరియు గొడవలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. ప్రతి జీవిలోనూ మంచి చెడు రెండు గుణాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం ఒక ప్రత్యేకమైన పక్షి గురించి తెలుసుకుందాం. ఈ పక్షి అరిస్తే చాలా అశుభం కలుగుతుంది అని చాలామంది నమ్ముతారు.
త్వరలో ఏదైనా చెడు జరగబోతుంది అనేది ఈ పక్షికి ముందుగానే తెలుస్తుందని అందుకే ఏదైనా దుర్ఘటన జరగబోయే స్థలంలో ఈ పక్షి తిరుగుతూ ఉంటుంది అని చాలామంది చెప్తారు. ఈ పక్షి పేరు టిటా హరి. దీనిని కిలికిలా అని కూడా పిలుస్తారు. కిల్ కిల్ అంటే గొడవలు అని అర్థం వస్తుంది. ఈ పక్షి హుటిటి టీ, హుటిటి టీ అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏ ఇంటి పైనుంచి ఈ పక్షి అరుస్తుందో ఆ ఇంట్లో ఏదైనా గొడవ లేదా కలహాలు తప్పకుండా జరుగుతాయని చాలామంది నమ్ముతారు.
ఒకవేళ ఒక వారం లేదా పది రోజులపాటు ఈ పక్షి ఏదైనా ప్రాంతంలో పదే పదే తిరుగుతూ అరుస్తూ కనిపించినట్లయితే ఆ ప్రాంతంలో ఏదైనా మరణ వార్త వింటారని చాలామంది నమ్ముతారు. టిటా హరి గుడ్లను బట్టి వర్షాకాలం ఎలా ఉంటుందో అంచనా వేస్తామని సాగరకు చెందిన 70 ఏళ్ల ద్రౌపది భాయి అమ్మమ్మ తెలిపారు. ఈ పక్షి గుడిలో వర్షాకాలం సీజన్లో ఎన్ని నెలల పాటు వర్షం కురుస్తుందో కూడా తెలియజేస్తాయట. కానీ ఈ పక్షి ఎవరైనా ఇంటి ప్రయారిస్తే మాత్రం దీనిని చాలా అశుభంగా భావిస్తారు.