Ayushman card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. 5 లక్షల ఉచిత భీమా.. ఈ అవకాశం ఎవరికో తెలుసా..!

Ayushman card
Ayushman card

Ayushman card: ప్రస్తుతం ఈ రోజుల్లో సామాన్య ప్రజలకు పేద ప్రజలకు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారంగా మారుతున్నాయి. కొంచెం వయసు పైబడిన వారికి ప్రతిసారి ఆసుపత్రి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అయ్యే ఖర్చులు ఇబ్బంది పడుతున్నాయి. కుటుంబ ఆర్థిక నిర్వహణను వైద్య ఖర్చులు చిన్నభిన్నం చేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ళు పైబడిన వారి కోసం ఐదు లక్షల వరకు ఉచిత విలువైన ఆరోగ్య చికిత్సను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల పైబడిన వారి కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని రూపొందించింది. 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు సమాధానంతో సంబంధం లేకుండా ఉచితంగా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య చికిత్స పొందవచ్చు.

ఈ పథకం కింద 4.5 కోట్ల కుటుంబాలు సమగ్ర ఆరోగ్య కవరేజీని అందించడంలో ఐదు లక్షల ఆరోగ్య భీమా కవర్ 6 కోట్ల మంది సీనియర్ సిటిజనులకు ప్రయోజనం కలిగిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ పోటోల్లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం మీరు పో ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. ఈ కార్డును పొందడానికి మీరు జాతీయ ఆరోగ్య వెబ్సైట్లో లేదా ఆయుష్మాన్ యాప్ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ఎన్ హెచ్ ఎ బెనిఫిషియరీ పోర్టల్ సందర్శించండి. అక్కడ మీరు మొబైల్ నెంబర్ను నమోదు చేసి ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించండి. అందులో 70 ఏళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న సీనియర్ సిటిజన్ల బ్యానర్ పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం తోపాటు జిల్లా మరియు ఆధార్ కార్డు నెంబర్ను నమోదు చేయండి. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు ఓటీపీను ఉపయోగించండి. రీసెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత కేవలం 15 నిమిషాలలో మీరు ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now