Home Remedies: బొద్దింకలు, ఈగలు వంటి అన్ని పురుగులకు కేవలం ఒకే ఒక చిట్కా.. తయారీ చాలా సింపుల్

Home Remedies
Home Remedies

Home Remedies: ఇంట్లో వానాకాలం సమయంలో అనేక పురుగులు ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. ఈ వానాకాలంలో వీటి బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చి ఇవి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలామంది ఇళ్లలో పురుగులు, కీటకాలు, బొద్దింకలు, ఈగలు వంటి బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. తేమ మరియు తడి వాతావరణం కారణంగా ఇవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

కానీ ఇవి ఇంట్లో ఉంటే మనకు చాలా చిరాకు అనిపిస్తుంది. మనం తినే ఆహారాలలో కూడా ఇవి పడతాయి. కూర్చున్నప్పుడు ముక్కులో దూరడం, తింటున్నప్పుడు ఆహారంలో పడడం ఇలా ఇంట్లో ఇవి చిరాకు తెప్పిస్తాయి. వీటి వలన అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి రసాయనాలు లేకుండా ఈ పురుగులను ఈజీగా తరిమికొట్టవచ్చు. మీకు దీని కోసం కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసుల నీరు, రెండు టీ స్పూన్ల లవంగాలు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు, ఒక స్ప్రే బాటిల్.

ముందుగా మీరు ఒక పాత్రలో రెండు గ్లాసుల నీరు వేయాలి. ఈ నీటిని బాగా వేడి చేసి మరుగుతున్న సమయంలో నీటిలో లవంగాలు వేయాలి. మరుగుతున్న నీటి రంగు మారిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిని మళ్లీ మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని చల్లారనివ్వండి. దీనిని ఒక స్ప్రే బాటిల్ లో తీసుకొని ఆ స్ప్రేలో బిర్యాని ఆకులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. ముఖ్యంగా ఇది కీటకాలు వచ్చే ప్రదేశాలలో స్త్రీని పిచ్చకారి చేయండి. బొద్దింకలు ఉన్న చోట కూడా స్ప్రే చేయండి. దీని నుంచి వచ్చే ఘాటైన వాసనకు బొద్దింకలు, పురుగులు వంటివి ఉండవు.

గమనిక:
ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల సలహా మేరకు ఈ చిట్కాలు. ప్రజా శంఖారావం వెబ్ సైట్ దిన్ని ఖచ్చితంగా ధృవీకరించడం లేదు. ఇది కేవలం మీకు ఒక క్రిమి కీటకాల నుండి ఉపశమనం కోసం సలహా మాత్రమే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now