Kitchen Fridge Vastu: పొరపాటున కూడా ఫ్రిడ్జ్ మీద ఈ వస్తువులను పెడితే భారీ ఆర్థిక నష్టాలు తప్పవు..
ఇంటిని నిర్మించుకుంటున్నప్పుడు చాలామంది వాస్తు శాస్త్రంలో ఉన్న అనేక వాస్తు నియమాలను శ్రద్ధగా పాటిస్తారు. వాస్తు నియమాల ప్రకారం నిర్మించిన ఇంట్లో శ్రేయస్సు, సంపద కలుగుతుంది అని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువుల గురించి కూడా నియమాలు చెప్పబడ్డాయి. ఈ నియమాల ప్రకారం ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ మీద కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మీద ఏదో ఒక వస్తువు పెడుతూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులను పెడితే భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.
పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఫ్రిజ్లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్ మీద అలంకరణ కోసం కొన్ని రకాలైన మొక్కలను పెడుతూ ఉంటారు. అయితే వెదురు మొక్కలను ఫ్రిడ్జ్ మీద పెట్టకూడదు. అలాగే కొంతమంది ట్రోఫీలు లేదా అవార్డులు కూడా ఫ్రిడ్జ్ మీద కనిపించేలా పెడుతూ ఉంటారు. అయితే వీటిని కూడా పెట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అవి ఇంట్లో అశుభం కలిగిస్తాయి. అలాగే డబ్బులను, బంగారాన్ని లేదా వెండి వస్తువులను కూడా పొరపాటున కూడా ఫ్రిజ్ మీద పెట్టకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఫ్రిడ్జ్ మీద పెట్టినట్లయితే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక సంక్షోభం కూడా తప్పదు. ఫ్రిడ్జ్ మీద మందులను పెట్టడం వలన వాటి ప్రభావం పోతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఫ్రిజ్ నుంచి వచ్చే ఔషధాలు మందులపై ప్రభావం చూపిస్తాయి అని సైన్స్ ప్రకారం చెబుతున్నారు. అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ను పశ్చిమ దిశలో ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే నైరుతి దిశను కూడా చాలా శుభప్రదంగా చెబుతారు. గోడకు కనీసం ఒక అడుగు దూరంలో ఫ్రిడ్జ్ ఉండేలాగా పెట్టుకోవాలి.