Kuberaa: ఈ మధ్యకాలంలో రోజురోజుకు థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్న సమయంలో ఇండస్ట్రీ ఉనికే ప్రమాదంగా మారుతుంది అని చెప్పొచ్చు. సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ కరువైపోతుండడం అలాగే చిన్న సినిమాలను ప్రజలు పట్టించుకోకపోవడం వంటి వాటి వలన ఇండస్ట్రీలో జనాలు కంగారు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో హిట్ 3 మరియు సింగిల్ వంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక నెల రోజుల నుంచి బాక్స్ ఆఫీస్ బోసిపోయింది. ఇక ఈ జూన్ నెలలో తొలి వారంలో రిలీజ్ అయిన థగ్ లైఫ్ కూడా నిరాశపరచడంతో ఈ నెల కూడా వేస్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒక మంచి సినిమా కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
సరిగ్గా ఇదే సమయంలో శేఖర్ కమ్ముల దశకతో వహించిన కుబేర సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో నటించిన కుబేర సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఆన్లైన్లో సాయంత్రం సినిమా సోల్డ్ అవుట్ షోలో కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల ముందు వరకు కుబేర సినిమాకు ప్రేక్షకులలో అంతగా బజ్ లేదు.
ఈ సినిమా కథ చాలా సీరియస్ గా ఉండడంతో ఇది ప్రేక్షకుల నుంచి ఏ మాత్రం ఆదరణ పొందుతుందో అని అందరిలో ఆందోళన నెలకొంది. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో కుబేర సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతగా జరగలేదు. తెలుగులో ఈ సినిమా పరిస్థితి మెరుగ్గా కనిపించింది అని చెప్పొచ్చు. కానీ చాలామందిలో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగా వచ్చాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుందని చెప్తున్నారు. ధనుష్ సినిమా కెరియర్ లో కుబేర సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడం అలాగే అక్కినేని నాగార్జునకు కూడా ఇది భారీ విజయాన్ని అందించడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.