Farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక పథకం అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన కమిటీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించేందుకు దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకంతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ప్రతి ఏడాది మూడు సార్లు పీఎం కిసాన్ యోజన పథకం కింద నిధులు జమ చేస్తుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతలుగా నిధులను జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వము అర్హుల జాబితా మీద తుదిక సరస్సు చేస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదలకు ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసినందుకు తుది కసరత్తు చేస్తుంది.
ఈనెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను అర్హులైన రైతుల ఖాతాలలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ నిధుల పథకం వాయిదా పడడంతో ఏపీ ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేయలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈనెల 30వ తేదీన పీఎం కిసాన్ విధులను విడుదల చేస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.