MLA MAGANTI: ఎమ్మెల్యే మాగంటి మృతి చాలా బాధాకరం

MLA MAGANTI
MLA MAGANTI

MLA MAGANTI: ఎమ్మెల్యే మాగంటి మృతి చాలా బాధాకరం

  • ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 9 (ప్రజా శంఖారావం): మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయసే పరమావధిగా భావించి నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న నాయకుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడం చాలా బాధాకరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఆరోగ్య కారణాలతో ఆయన మృతి చెందడం ప్రజలకు తీరని లోటని చెప్పారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి జగిత్యాల ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now