Cash Rules India : ఇంట్లో ఎంత మొత్తంలో డబ్బు ఉంటే ఐటీ రైడ్స్ తప్పవు.. ఇవి లేకపోతే చిక్కుల్లో పడతారు

Cash Rules India
Cash Rules India

Cash Rules India : ఇంట్లో నగదును ఎంతవరకు ఉంచుకోవచ్చు అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాగే ఇంట్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉంటే అధికారులు ఎక్కడ పట్టుకుంటారు అనే భయం కూడా మనలో చాలామందికి ఉంటుంది. అయితే నిజంగానే ఇంట్లో నగదు విషయంపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. కానీ వీటి గురించి చాలామందికి అవగాహన లేదు అని చెప్పాలి. ఇంట్లో, ఆఫీసులో లేదా మన చేతిలో ఎంతవరకు నగదు పెట్టుకోవచ్చు అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంచుకున్నట్లయితే ఐటీ రైట్స్ జరుగుతాయి అని చాలామంది భయపడతారు.

ఇటువంటివి వార్తలలో చూసినప్పుడు వాళ్లలో ఉన్న భయం మరింత ఎక్కువ అవుతుంది. అయితే మన దేశంలో ఇంట్లో నగదు నిలువపై ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేవని చెప్పాలి. మీరు ఇంట్లో, ఆఫీసులో లేదా చేతిలో ఎంత డబ్బైనా కూడా పెట్టుకోవచ్చు. వీటిపై ఎలాంటి నిబంధనలు లేదా నియంత్రణలు లేవు. ఇంట్లో ఇంత మొత్తంలోనే డబ్బు పెట్టుకోవాలి అని ఆదాయపు పని శాఖ కూడా ఎక్కడ వివరించలేదు. డబ్బు ఎంత మొత్తంలో అయినా ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేదానికి మాత్రం రుజువులు ఉండాలి.

మీ ఇంట్లో ఉన్న ప్రతి పైసాకు కూడా మీ దగ్గర సరైన ఆధారం ఉండాలి. ఆస్తి అమ్మితే వచ్చినదా, జీవితంలో సంపాదించినదా లేదా వ్యాపారం చేస్తే వచ్చినదా ఇలా మీ దగ్గర ఉన్న డబ్బులు అన్నిటికి చట్టపరమైన ఆధారాలు ఉండాలి. ఆదాయపు పన్ను శాఖలో ఉన్న చట్టం 68 మరియు 69 బి ప్రకారం ఆదాయానికి మించి మీరు కూడా పెట్టిన ఆస్తులకు అలాగే నగదుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు ఉన్నట్లయితే వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ డబ్బుకు సరైన వివరణ ఇవ్వకపోతే అది లెక్కలలో చూపించని ఆదాయంగా ఆదాయపు పన్ను శాఖ వారు పరిగణిస్తారు. అప్పుడు ఆ మొత్తం నగదు పై ఆదాయపు పన్ను శాఖ వారు 78% భారీ జరిమానా విధిస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now