USA: ఇకపై అమెరికాలో మన వాళ్లకు ఉపశమనం.. అమెరికా వెళ్లాలనుకునేవారికి మంచి రోజులు

USA
USA

USA: అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లే విదేశీ విద్యార్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. గతంలో కంటే 2024 లో ఈ అవకాశాలు భారీగా పెరిగాయి. 2024 లో సుమారు రెండు లక్షల మంది విద్యార్ధులకు ట్రైనింగ్ అవకాశాలను పలు కంపెనీలు కల్పించాయి.

అంటే వివిధ కంపెనీల ఉపాధి గణాంకాల ప్రకారం గతంలో కంటే ఇది 21 శాతం అధికం కావడం విశేషం. ఇండియా నుంచి ఎక్కువగా ఇంజనీరింగ్ లో సైన్స్, గణితం, వివిధ రంగాల్లో సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్యార్తులు అమెరికాలోని విద్యాసంస్థల్లో పీజీ (ఎంఎస్ ) కోర్సుల్లో చేరుతున్నారు. అమెరికాలో ఎంఎస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేరుతున్నారు. ఈ కోర్సుల్లో ఇండియా విద్యార్థులే ఎక్కువగా చేరడం విశేషం.

ఎఫ్-1 వీసాను రెండేళ్ల పాటు అమెరికా ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ గడువు భారతీయ విద్యార్థులకు మంచి అవకాశం కావడంతో ఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులు రెండేళ్ల పాటు ఈ శిక్షణలో చేరడానికి మార్గం సులువైనది. దింతో అక్కడే ఒకవైపు చిన్న, చిన్న పనులు చేసుకుంటూ, మరోవైపు శిక్షణ కూడా రెండేళ్లలోనే పూర్తి చేసుకుంటున్నారు భారతీయ విద్యార్థులు. ఈ విదంగా రెండేళ్ల వీసా అనుమతి పొందిన మన దేశ విద్యార్థులే 95 వేల పైబడి ఉండటం విశేషం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now