Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈ హీరోయిన్ కు బాగా గుర్తింపు ఉండేది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ అనుకోకుండా కెరియర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించే బాగా ఫేమస్ అయ్యింది. కానీ ఈమె సడన్ గా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలోనే సినిమాలను వదిలేసి సన్యాసిగా మారిపోయింది.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు గ్లామర్ను వదిలేసి తమకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడిగా స్క్రీన్ షేర్ చేసుకున్న ఒక టాప్ హీరోయిన్ సినిమాలను మానేసి బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకుంది. ఈ హీరోయిన్ పేరు బర్క మద. ఈమె ఒకప్పుడు మోడల్ గా కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమార్, రేఖ నటించిన ఖిలాడీ యో కా కిలాడి అనే సినిమాతో 1996లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

1994లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలలో విజేతలుగా నిలిచిన సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లతో కలిసి ఈమె కూడా పోటీ చేసింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన భూత్ అనే సినిమాతో 2003లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో బర్కా మదన్ కు బాగా పాపులారిటీ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పొచ్చు. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకొని టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు తన కెరీర్లో 20 సినిమాలలో నటించింది. పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది. కానీ ఈమె 2012లో గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసి బౌద్ధ సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకుంది.