Black Thread: చాలామందికి కాలికి నల్ల దారం కట్టుకునే అలవాటు ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే ఇలా కట్టుకోవడం మంచిదే కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి కాలికి నల్లదారం తట్టుకోవడం ప్రతికూల ప్రభావం చూపుతుంది అని నిపుణులు అంటున్నారు. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. చిన్నపిల్లలకు అయితే దిష్టి తగలకుండా చాలామంది నల్లదారం కాలికి కడతారు. శాస్త్రం ప్రకారం కాలికి నల్ల దారం కట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
దృష్టికి సంబంధించిన సమస్యలకు కాలికి ఉండే నల్ల దారం చెక్ పెడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం కాలికి నల్ల దారాన్ని కట్టుకోకూడదు అని అంటున్నారు. మరి కొంతమంది కాలికి నల్ల దారం కాకుండా ఎర్రదారం కట్టుకుంటారు. అలాగే మరి కొంతమంది కాలికి వెండి ఉంగరం ధరిస్తారు. మేషరాశి వారికి అధిపతి కుజుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కుజుడు కి ప్రతీక ఎరుపు రంగు. నల్ల రంగు అనేది శని గ్రహానికి సంబంధించినది కాబట్టి కుజుడికి శనికి మధ్య వైరం అని అంటున్నారు.
కాబట్టి మేషరాశికి చెందినవారు కాలికి నల్లదారం కట్టుకుంటే వాళ్ల జీవితంలో ప్రతికూల ఫలితాలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. వృశ్చిక రాశికి కూడా అధిపతి కుజుడు కాబట్టి వీళ్లు కూడా కాలికి నల్లదారం కట్టుకోవడం వలన ప్రతికూల ప్రభావం కలుగుతుంది. ఇక ధనస్సు రాశికి అధిపతి గురువు అంటే బృహత్పతి. కానీ నల్ల రంగు గురువుకు శుభప్రదం కాదని చెప్తున్నారు. ధనస్సు రాశి వారు కూడా కాలికి నల్లదారం ధరించినట్లయితే వాళ్ల జీవితంలో ఆర్థికపరంగా మరియు వృత్తిపరంగా ఆటంకాలు ఏర్పడవచ్చు అని నిపుణులు అంటున్నారు. మీన రాశికి అధిపతి గురువు కావడంతో వీళ్లు కూడా కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిది కాదు.