Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మధ్యతరగతి, పేదింటి వారికి కావలసిన గుర్తింపు కార్డులలో అతి ముఖ్యమైనది అందరూ తమకు ఉండాలి అనుకునేది రేషన్ కార్డ్ (Ration card). తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఎండ్లలో రేషన్ కార్డులు మంజూరవుతాయని ప్రతి పేదింటి కళ్ళు రేషన్ కార్డుల వైపు చూశాయి. కానీ గడిచిన పది సంవత్సరాలు రేషన్ కార్డుల మంజూరి నిరీక్షణకు రేవంత్ సర్కార్ తెరదించింది. కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) తెలిపారు.
Also Read: 28 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అపూర్వ సమ్మేళనం
రాష్ట్రంలో పేదవాడి కలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జాతరను నిర్వహిస్తున్నామని, మొదటి విడతలో భాగంగా సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) చేతుల మీదుగా రేషన్ కార్డులను అందజేయున్నట్లు ఆయన చెప్పారు. మంజూరైన రేషన్ కార్డులతో కలిపి 95 లక్షల 60వేల వరకు రేషన్ కార్డుల సంఖ్య పెరిగినట్లు ఆయన వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి 1150 కోట్ల అదనపు ఆర్థిక భారం ఉంటుందని ఆయన అన్నారు.
Also Read: తీన్మార్ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు
పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళుతుందని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డుల పంపిణీ (Distibution) కార్యక్రమం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విడుదలవారీగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించే విధంగా ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.