RBI NEW RULES: ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో పొదుపు ఖాతా ఉండడం చాలా ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. ఆర్థిక ప్రయోజనాలు, రోజువారి బ్యాంకింగ్ లావాదేవీలకు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు పొందాలంటే కచ్చితంగా బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులలో రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల కోసం కొన్ని కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
మీరు ఈ కొత్త నియమాలను అర్థం చేసుకోవడం వలన ఆర్థిక జరిమానాలు అలాగే సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుంది. రుణం చెల్లింపులు, పొదుపు పథకాలు లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం అలాగే జీతం డిపాజిట్లు వంటి అనేక కారణాల వలన చాలామందికి బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ ఖాతాలలో ఒక బ్యాంక్ ఖాతా మీకు ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ మిగిలిన అనవసరమైన ఖాతాల కారణంగా మీపై అదనంగా ఆర్థిక భారం పడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం చార్జీలు, సమస్యలను నివారించడానికి ఒకటికంటే ఎక్కువ ఖాతాలు కలిగిన వ్యక్తులు అ ఖాతాలను మూసివేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
మీరు ఏదైనా ఒక బ్యాంకు కాదా ఎక్కువ కాలం పాటు ఉపయోగించకపోతే అది నిష్క్రియంగా మారుతుంది. అటువంటి ఖాతాలపై బ్యాంకులో జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులలో ఖాతాలకు మినిమం బాలన్స్ అవసరం కూడా ఉంటుంది. ఆ మినిమం బాలన్స్ రూల్స్ మీరు పాటించకపోతే మీపై జరిమానా కూడా విధించబడుతుంది. ఈ విధంగా ఉండడం వలన ఆ ఖాతాలో ఉన్న నిధులు కాలక్రమమైన క్షీణింపబడతాయి. ఇటువంటి ఖాతాల ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ అలాగే ఈఎంఐ చెల్లింపులపై కూడా పడే ప్రమాదం ఉంది. దీంతో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైన ఖాతాలను మాత్రమే యాక్టివ్ లో ఉంచుకోవాలి అంటూ కస్టమర్లను ప్రోత్సహిస్తుంది.