Gold Loan: RBI కొత్త రూల్స్..10 గ్రాముల బంగారంపై ఎంత లోన్ వస్తుందంటే

Gold Loan
Gold Loan

Gold Loan: చాలామంది తమకు ఆర్థిక అవసరాలు ఏర్పడిన సమయంలో బంగారాన్ని తాకట్టుపెట్టి తక్కువ వడ్డీకి బ్యాంకులలో కానీ లేదా ఇతర ఆర్థిక సంస్థలలో కానీ లోన్ తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న సమయంలో బంగారం వారికి ఒక ఆర్థిక భరోసాగా ఉంటుంది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారంపై లోన్ విషయంలో కొన్ని కీలక మార్పులను చేపట్టింది. చాలామంది అత్యవసరంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో పర్సనల్ లోన్ లేదా మోర్టాగేజ్ లోను వంటివి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ ఇంట్లో బంగారం ఉన్నట్లయితే వారు బంగారాన్ని తాకట్టుగా పెట్టి తక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటారు.

కానీ తాజాగా ఆర్బిఐ గోల్డ్ లోన్ తీసుకునేవారికి కొన్ని కీలక నియమాలు ప్రవేశపెట్టింది. ఆర్బిఐ తీసుకొని వచ్చిన ఈ కొత్త నిబంధనలు లోన్ తీసుకునే వారితోపాటు లోన్ ఇచ్చేవారికి కూడా చాలా సౌకర్యవంతంగా ప్రయోజనకరంగా ఉంటాయని తెలుస్తుంది.ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం ఆర్.బి.ఐ తీసుకుని వచ్చిన ఈ కొత్త నియమాలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ కారణంగా బంగారాన్ని తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బులను పొందవచ్చు. ముఖ్యంగా బంగారం విలువలో గరిష్టంగా 80 శాతం వరకు అందుతుంది.

ఇది రూ.2.5 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు లోన్ తీసుకునే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఐదు లక్షల కంటే ఎక్కువ లోన్ కావాలంటే అప్పుడు మొత్తం బంగారం విలువలో గరిష్టంగా 75% లోన్ ఇస్తారు. అన్ని బ్యాంకులతో పాటు అన్ని ఆర్థిక సంస్థలలో కూడా ఏప్రిల్ ఒకటి, 2026 నుంచి ఆర్బిఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు అమలు అవుతాయి. ఒకవేళ మీరు ఒక తులం అంటే 10 గ్రాముల పై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను అయితే ఆ బంగారం ప్యూరిటీ మరియు దాని మార్కెట్ ధరపై మీకు వచ్చే లోన్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు తులం రూ.70,000 ఉన్నట్లయితే మీకు దానిలో 80% అంటే రూ.56,000 వరకు లోన్ వస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now