RBI: ఈ బ్యాంకులలో భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఏ ఏ బ్యాంకులో ఎంత ఉందంటే..

RBI Intrest Rates
RBI Intrest Rates

RBI: ఈ బ్యాంకులలో భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఏ ఏ బ్యాంకులో ఎంత ఉందంటే..

 

రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో దానికి అనుసంధానం అయిన వడ్డీ రేటులను బ్యాంకులు కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రిజ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ పై ఇంట్రస్ట్ రేట్లను తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ బ్యాంకుల మాదిరిగానే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంకులో కూడా వడ్డీ రేట్లు తగ్గించాయి.

ఆర్ ఎల్ ఎల్ ఆర్ ను తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 50 బేసిక్ పాయింట్లు తగ్గించి 8.15 శాతంగా ప్రకటించింది. జూన్ నెల 7వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. అలాగే యూకో బ్యాంకు నిధుల వ్యయం ఆధారంగా రుణా రేటు నో అలాగే ఆర్ ఎల్ ఆర్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల పదవ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలు కానున్నాయి. యూకో బ్యాంకు ఎంసిఎల్ఆర్ ను 10 బేసిక్ పాయింట్లు తగ్గించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 8.25% నుంచి ఎంసీఎల్ 8.15 శాతానికి వచ్చింది.

అలాగే ఒక నెలకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ ను 8.35 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ ను 8.5 శాతానికి ఇక ఆరు నెలల ఎంసీఎల్ఆర్ ను 8.8 శాతానికి, ఒక ఏడాదికి సంబంధించిన ఎంసీఎల్ ఆర్ ను 9 శాతానికి యూకో బ్యాంకు తగ్గించడం జరిగింది. 50 బేసిస్ పాయింట్లు ఆర్ ఎల్ ఎల్ ఆర్ ను తగ్గించి 8.30 శాతానికి ప్రస్తుతం పరిమితం చేసింది. సంవత్సరం ఎంసీఎల్ ఆర్ రేటును కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.80 శాతానికి పరిమితం చేసినట్లు ప్రకటించింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now