Revanth Reddy: ఖరీఫ్ సీజన్ లో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనది. రాష్ట్రంలోని రైతులందరికీ తొమ్మిది రోజుల్లోనే పెట్టుబడి సాయం అందించ నున్నామని. ప్రకటించింది. అంతే కాదు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సాయం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రకటించిన మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే పెట్టుబడి సాయం రైతులకు పంపిణి చేయడానికి ఆర్థిక వనరులను ఏర్పాటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రైతు పండుగ నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సిద్దమైనది.
రైతు భరోసా పథకానికి ప్రభుత్వం సోమవారం రూ : 513 కోట్ల పైబడి నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో వెంట, వెంట నిధులు జమవుతున్నాయి. ఏడు రోజుల్లో రూ : 8,885 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం పెట్టుబడి సాయం జమచేసింది. రైతు భరోసా నిధుల పంపిణి విజయవంతం కావడంతో రైతు పండుగను నిర్వహించబోతోంది
రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రైతు పండుగను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఈ సభను రాష్ట్ర వ్యాప్తంగా నియోజకకేంద్రాలతోపాటు, మండల, గ్రామ స్థాయిలో రైతుల సమక్షములో నిర్వహించనున్నారు.