Todays Gold Rate: మీరు మార్కెట్లో వెండి లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్న సమయంలో నాణ్యత పై శ్రద్ధ వహించాలి. హాల్ మార్కును తనిఖీ చేసి బంగారం కొనుగోలు చేయాలి. హాల్ మార్క్ ఉన్న బంగారానికి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా బంగారం ధరలలో మార్పులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ తాజాగా పెరిగినట్లు సమాచారం.
నిన్నటితో ఈరోజు తులం బంగారం రేటు పై 1000 రూపాయలు పెరిగింది. మన దేశ సంస్కృతి, సాంప్రదాయం బంగారంతో ముడిపడి ఉన్నాయి. వీటి ధరలు పెరిగినా లేదా తగ్గినా కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. జూన్ 12, గురువారం రోజున వేసవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తున్నాయి. ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,410, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,210 గా ఉన్నాయి.
ఇక దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు రూ.98,410, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.90,210 గా ఉన్నాయి.
ఇక ఢిల్లీ నగరంలో మాత్రం ఈరోజు తులం గోల్డ్ ధర 24 క్యారెట్లు రూ.98,560, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,360 గా ఉన్నాయి. అయితే ఈరోజు వెండి ధర మాత్రం 100 రూపాయలు తగ్గింది. మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి ధర రూ.1,08,900 గా ఉందని సమాచారం.