SI Suspension: విధుల్లో నిర్లక్ష్యం.. మరొక ఎస్సై సస్పెండ్..
రామారెడ్డి/ఎల్లారెడ్డి, ఏప్రిల్ 24 (ప్రజా శంఖారావం): వీధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై పై ఐజిపి చంద్రశేఖర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నరేష్ ను ఫిర్యాదుదారులు అనేకసార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎస్సై నరేష్ వారి గోడు పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం వహించడమే కాకుండా, కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడంతో జిల్లా ఎస్పీ రాజచంద్ర దృష్టికి వెళ్లడంతో తక్షణమే జిల్లా ఎస్పీ ఐ జి పి దృష్టికి తీసుకెళ్లడంతో సస్పెన్షన్ వేటు పడింది.
చట్టం ముందు అందరు సమానులే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు.. అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పోలీస్ సిబ్బందిపై నిగా ఎప్పటికీ ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేయడం జరిగింది.