SIP Investment: పొదుపు పథకాలు అనగానే డబ్బున్నవారు, పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవారు పొదుపు చేయడం అనుకుంటారు. కానీ మధ్యతరగతి వారు కూడా వారి స్థోమతను బట్టి పొదుపు పథకాలలో చిన్న మొత్తాలలో పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ (Good Returns) పొందవచ్చు. అది ఎలాగో ఒకసారి తెలుసుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) లో ప్రతినెల రూ.500 పెట్టుబడి పెట్టి 5 నుండి 10 సంవత్సరాల్లో మంచి రాబడిని అందుకోవచ్చు.
ఈ SIP మ్యూచువల్ ఫండ్స్ విధానంలో మనం పెట్టే పెట్టుబడిలో సంవత్సరానికి ఒకసారి 10% పెట్టుబడితో పెంచుతూ మెచ్యూరిటీ టైం వరకు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ప్రతినెల మనము ఖర్చు చేసే ఖర్చులో నుండి ఒక 500 రూపాయలు మాత్రం ఈ SIP ద్వారా పెట్టుబడిగా మలుచుకొని ఇన్వెస్ట్ (Investment) చేస్తే పిల్లల భవిష్యత్తుకు ఏదో ఒక రూపంలో మనకు ఆసరాగా ఉంటుంది.
ఉదాహరణకు ప్రతి నెల పెట్టుబడి
ఉదాహరణకు ప్రతి నెల మనం రూ. 500 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరానికి 12 శాతం వడ్డీ వస్తుంది అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత మొత్తం మనం పెట్టే మొత్తానికి దాదాపు 40 వేల రూపాయల ఫండ్ వాల్యూ ఉంటుంది. మనం పెట్టే పెట్టుబడి సుమారు 30 వేల రూపాయలు పెట్టినప్పుడు అదనంగా 10500 ద్రవ్య ఉత్పత్తిని అందుకుంటాం. అలాగే ఇక్కడ మనం పన్ను (Tax) చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
Also Read:సూపర్ డూపర్ స్కీమ్.. కేవలం నెలకు రూ.4వేలు పెట్టుబడి పెడితే రూ.60 లక్షలు పొందొచ్చు
చిన్న పొదుపు పథకం
మరి 10 సంవత్సరాలపాటు SIP లో పెట్టుబడి కొనసాగిస్తే ఈ రిటర్న్స్ ను ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ 10 సంవత్సరాల్లో (10Years) మన పెట్టుబడి 60 వేల రూపాయలు అయితే సుమారు ఒక లక్షా 12 వేల రూపాయలు వరకు జమ కావచ్చు. ఇది చిన్న పొదుపు పథకమైన (Saving Plan) మనము ఒక నిర్దిష్ట ప్రణాళికతో పెట్టుబడి పెట్టుకుంటూ వెళితే మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి రిటర్న్స్ చివరి వరకు పొందవచ్చు.
ఆర్థిక సలహాలు తీసుకోవడం తప్పనిసరి
ఆర్థిక నిపుణుల సలహా మేరకు మనం పెట్టే పెట్టుబడిలో సంవత్సరానికి ఒక 10% పెంచుకుంటూ పోతుంటే SIP మ్యూచువల్ ఫండ్ విధానంలో మంచి రిటర్న్స్ పొందవచ్చని నిపుణులు (Experts) సూచిస్తున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ పథకంలో మనం పెట్టుబడి పెట్టాలి అనుకునే ముందు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనే మూడు విభాగాలలో మనకు తగిన విధానాన్ని ఎంచుకోవడం మంచిది.
Also Read:అద్భుతమైన స్కీమ్.. రూ. 4వేలు ఇన్వెస్ట్ చేస్తే.. చురిటీ టైం వరకు 60 లక్షలు రిటర్న్..
చిన్న మొత్తాలను మన సంపాదన నుండి పొదుపు మార్గం వైపు ప్రణాళికతో అడుగులు వేస్తే క్రమక్రమంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) విధానంలో మంచి రిటర్న్స్ వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మన ఎదైనా పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక (Financial) సలహాలు తీసుకోవడం తప్పనిసరి. (గమనిక మీ పెట్టుబడి విధానాన్ని మీరు ఎంచుకోవడంలో ఇది ఒక సలహా మాత్రమే. మీ పెట్టుబడికి “ప్రజా శంఖారావం” వెబ్ సైట్ ఎటువంటి బాధ్యతను తీసుకోదు గమనించగలరు).