Todays Gold Rate: మహిళలకు ఈరోజు చేదు వార్తా. గత కొన్ని రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. మన దేశ మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు అని చెప్పొచ్చు. మగువలు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపించే వస్తువులలో బంగారం ముందుంటుంది. త్వరలో శ్రావణమాసం వస్తున్న క్రమంలో చాలామంది శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ ఆల్టైమ్ హై రికార్డుకు చేరుకున్నాయి. బుధవారం రోజున అంతర్జాతీయంగా పెరిగిన బంగారం ధరలు మన దేశ మార్కెట్లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక జూలై 9 బుధవారం రోజున మన దేశ మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,850, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,610 గా ఉన్నాయి.
దేశంలో పలు ముఖ్య ప్రాంతాలు బెంగళూరు, చెన్నై, ముంబైలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,850, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,610, కిలో వెండి ధర రు.1,19,800 గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో బుధవారం రోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,850, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,610, కిలో వెండి రూ.1,19,800 గా ఉన్నాయని సమాచారం.