Kamareddy: జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలు రూపొందించాలి

Kamareddy
Kamareddy

టిడబ్ల్యూజెఎఫ్ కామారెడ్డి

కామారెడ్డి, జూన్ 30 (ప్రజా శంఖారావం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలను రూపొందించాలని టిడబ్ల్యూజెఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన రాజకీయ ముసుగులో ఉన్న గూండా నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కోరుతూ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం ముందుగల అంబేద్కర్ విగ్రహానికి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రవీణ్ గౌడ్, కృష్ణచారిలు మాట్లాడుతూ, దేశంలో చాలా రాష్ట్రాలలో ఏదో ఒకచోట ప్రతి రోజు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలను రూపొందించాలని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారు రాజకీయ నాయకులైనా? మరి ఇంకెవరైనా సరే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వo పార్లమెంటులో చర్చించి ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, ఇలాంటి ఘటనలు దేశంలో, రాష్ట్రంలో మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో టిడబ్ల్యూజెఎఫ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, కార్యదర్శి కరుణాకర్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి, మోహన్, ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ దశరథ్, బంగారి, శివకుమార్, శ్రీకాంత్, భాస్కర్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now