Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప రాజా నీతజ్ఞుడు, తక్షశిల అధ్యాపకుడు. అత్యంత ప్రాచీన భారతదేశ పండితులలో ఇతను కూడా వివిధ పేర్లతో రాసిన గ్రంథాలు నేటికీ ప్రజలు అనుసరిస్తున్నారు. నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన ఆయన పొందుపరిచిన విధివిధానాలు ఇప్పటి తరం ప్రజలు కూడా అనుసరించి జీవితంలో విజయం సాధిస్తున్నారు. అయినా విద్యార్థులు విద్యను ఆర్జించే విధానాన్ని కూడా తన నీతి శాస్త్రంలో తెలిపాడు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించి ఉన్నత స్థానంలో చేరుకోవాలి అంటే కొన్ని అలవాట్లను వదులుకోవాలి అంటూ ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. విద్యార్థి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి.
వాళ్లు ముందుకు సాగాలి అంటే కొన్ని విషయాలను త్యాగం చేయాలి. అలాగే మరికొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు విద్యార్థులకు సంబంధించిన అనేక విషయాల గురించి తెలిపాడు. ఇప్పటికీ కూడా ఆయన ప్రాచీన భారత పండితుడిగా ప్రఖ్యాతి సాధించాడు. విద్యార్థులు చేయకూడని కొన్ని విషయాల గురించి ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో వివరించాడు. విద్యార్థుల కు దురాశ ఉండకూడదు. ఒక వ్యక్తికి ఉన్న దురాశ కారణంగా అతని తప్పుడు మార్గంలో పయనిస్తాడు. ఇది అతని లక్ష్యాలనుంచి దూరం చేస్తుంది అని ఆచార్య చానికిలు తెలిపాడు. అలాగే కోపం లేకుండా జీవితంలో నిజాయితీగా ఉండాలి.
Also Read: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఆచార్య చాణిక్యుడు చెప్పిన అద్భుతమైన సూత్రాలు ఇవే
చదువుకునే విద్యార్థులు కోపంగా ఉండకూడదు అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఒక వ్యక్తికి ఉన్న కోపం అతని ఆలోచన శక్తిని తగ్గిస్తుంది అలాగే సంబంధాలను కూడా చెడిపోయేలా చేస్తుంది. అలాగే విద్యార్థులు నోటికి రుచి కోసం వేయించిన ఆహారాలను తినకూడదు. అది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సరళమైన మరియు సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విద్యార్థులు చదువుకునే సమయంలో ఏకాగ్రత అనేది చాలా అవసరం. కాబట్టి అటువంటి సమయంలో అతిగా దుస్తులను ధరించడం గొప్పగా కనిపించడం వంటి పనులను చేయకూడదు. చదువుకునే విద్యార్థులు అతినిద్రను కూడా వదులుకోవాలి అని ఆచార్య చానిక్యుడు తెలిపాడు.