Viral Video: తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ వీకైన తర్వాత భారీ పేలుడు జరిగింది. ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఈ పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇల్లు మొత్తం మంటలతో ఎగసిపడుతున్న సమయంలో ఆ భార్య భర్తలు ఇద్దరూ ఎలా బయటపడ్డారో ఈ షాకింగ్ వీడియోలో కనిపిస్తుంది. అందరికీ షాక్ కు గురి చేసే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చాలా వేగంగా వైరల్ అవుతుంది. ఒక ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ఇంట్లో ఉన్న భార్య భర్తలు ఇద్దరు కూడా తృటిలో ప్రమాదాన్ని తప్పించుకొని బయటపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందరికీ కూడా ఈ వీడియో భయాన్ని కలిగిస్తుంది. అలాగే అంత పెద్ద ప్రమాదం నుంచి భార్య భర్తలు ఇద్దరూ ఎలా బయటపడ్డారు అనే ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. ఈ వీడియోలో గ్యాస్ లీక్ అయ్యే ఇల్లంతా పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో వాళ్ళిద్దరూ ఇంటి నుండి బయటకు పరిగెత్తిన దృశ్యాన్ని కూడా చూడవచ్చు. అయితే ఇది ఎక్కడ జరిగిందో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. జూన్ 18 బుధవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ చేయబడింది.
వీడియోలో మీరు గమనించినట్లయితే ఎల్పిజి సిలిండర్ పైపు లీక్ అయింది. గ్యాస్ లీక్ అవుతున్న సిలిండర్ అలాగే పైపు చేతిలో పట్టుకొని వంటింట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరూ గ్యాస్ లీకేజీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ భారీ లీకేజ్ నే మహిళ ఆపలేకపోయింది. అప్పుడే సిలిండర్ నేలపై పడిపోవడంతో మరింత గ్యాస్ లీక్ అయ్యింది. తర్వాత ఆ మహిళకు సహాయంగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇద్దరు గ్యాస్ పైప్ నాప్ ను మూసి వేయడం ద్వారా గ్యాస్ లీకేజీని ఆపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఇల్లంతా కూడా గ్యాస్ తో నిండిపోవడంతో వంటగదిలో భారీ పేలుడు సంభవించింది. అయితే మహిళా గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో ఇంట్లో ఉన్న మొత్తం తలుపులు కిటికీలను తెరిచి ఉంచడంతో పేలుడు ప్రభావం తగ్గినట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.