Metpally: మెట్ పల్లి/కోరుట్ల, జూలై 06 (ప్రజా శంఖారావం): అభం శుభం తెలియని ఆ చిన్నారిని వరుసకు చిన్నమ్మ అవుతున్న తను ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. తల్లి తరువాత స్థానంలో తల్లి అని చెప్పుకునే చిన్నమ్మ స్థానంలో ఉన్న ఆమె ఆ చిన్నారికి చేసిన ఘోరం సభ్య సమాజం తలదించుకునేలా ఆ ఘటన జరిగింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన చిన్నారి హత్య ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో చిన్నారి హీక్షిత (5) హత్య కేసులో కేసు పురోగతిని సాధించినట్లుగా తెలుస్తుంది.
చిన్నారి హత్యకు వరుసకు చిన్నమ్మ అయిన మమత ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం?. ఆమె దగ్గర నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య చేసే సమయంలో ఉపయోగించిన బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని కడతేర్చింది చిన్నమ్మ నేనా..? స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.