Arya movie: తెలుగులో ఇప్పటివరకు వచ్చిన అందమైన ప్రేమ కథ సినిమాలలో ఆర్య సినిమా కూడా ఒకటి. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా వీక్షిస్తారు. అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించబడింది. ఇక 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ కథ చాలా కొత్తగా అనిపించడం అలాగే ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇక అప్పటివరకు వచ్చిన ప్రేమ కథ సినిమాలకు ఆర్య సినిమా కథ చాలా భిన్నంగా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కెరీర్ కూడా మలుపు తిరిగిందని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాలో పాటలు మాత్రం అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఆర్య సినిమాకు అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించిన హీరోయిన్ అను మెహతా. తొలి లుక్ లోనే ఆర్య సినిమాతో ఈ బ్యూటీ కుర్రాళ్ళ మనసులో స్థానం సంపాదించుకుంది. ఆర్య సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అను మెహతా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో అను మెహతా ఆర్య, నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ వంటి సినిమాలలో నటించింది.
అయితే వీటిలో ఆర్య సినిమా మాత్రమే సూపర్ హిట్ అయింది. చివరిసారిగా ఈమె 2008లో రిలీజ్ అయిన కన్నడ సినిమా హోం గానసు లో నటించింది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆర్య సినిమాలో గీత పాత్రలో నటించిన అను మెహతా ప్రస్తుతం ఎలా ఉందో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాగర తీరంలో అందాలను ఆరబోస్తూ ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి.