Sukanya Samriddhi Yojana: జూన్ 30, 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకంతో పాటు మిగిలిన స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లు మార్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పథకాలకు సంబంధించి కొత్త రేట్లు జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు వర్తిస్తాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే జులై 1 నుంచి ఈ పథకం పై వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు 1 శాతం తగ్గించింది.
దీంతో అన్ని బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు తమ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే సేవింగ్స్ అకౌంట్ లపై కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వడ్డీ రేట్లు సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్స్ పథకాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి.దీంతో జూన్ 30 తర్వాత సుకన్య సమృద్ధి యోజన పథకంలో కూడా స్వల్పంగా వడ్డీ రేటులో తగ్గుదల ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరంలో తొలి త్రైమాసికంలో స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
పోస్ట్ ఆఫీస్ పొదుపు అకౌంట్ కి నాలుగు శాతం, ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.9%, రెండేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ పై ఏడు శాతం అలాగే మూడేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.1 శాతం, ఐదేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.5%, ఐదేళ్లు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7%, సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం పై 8.2 శాతం అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీం పై 7.4% కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ పై 7.7%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకం పై 8.2 శాతం, 7.5% వడ్డీ రేటు లభిస్తుంది.