Ration Cards: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అయితే గత కొంతకాలం నుంచి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలు కూడా రేషన్ తీసుకోవడం లేదు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇటువంటి వారిపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వరుసగా ఆరు నెలలు రేషన్ తీసుకొని రేషన్ కార్డు లబ్ధిదారుల రేషన్ కార్డును రద్దు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో అన్ని మండలాల నుంచి అధికారులు సమాచారాన్ని సేకరించారు.
అధికార యంత్రం గత ఆరు నెలల నుంచి రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకొని వారి వివరాలను పరిశీలిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఆరు నెలల నుంచి ఒకసారి కూడా రేషన్ తీసుకొని 76,842 రేషన్ కార్డులో ఉన్నట్లు అధికారులు పరిశీలించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్డులన్నింటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖ ఈ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించడంతో మరికొన్ని రోజుల్లో వీళ్ళందరిని స్టేషన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పౌరసరఫరాల శాఖ 76,842 రేషన్ కార్డు లబ్ధిదారులలో అనర్హులైన వారిని గుర్తించి త్వరలోనే వారి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా వరుసగా ఆరు నెలల నుంచి రేషన్ తీసుకుని వారి జాబితాను రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ మొత్తం జాబితాను అన్ని జిల్లాలలో కలెక్టర్లకు పంపడం జరిగింది. క్షేత్రస్థాయిలో విచారణ జరగగా అందులో మొత్తం 76,842 రేషన్ కార్డులు అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. అలాగే మరి కొంతమంది రేషన్ కార్డులలో మరణించిన వారి వివరాలను అప్డేట్ చేయలేదు. మరి కొంతమంది లబ్ధిదారుల వివరాలు చాలా తప్పుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.