Womens: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులైన 65 లక్షల మంది మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహిళలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సిరిసిల్లలోని పవర్ లూమ్ లపై ఈ చీరలను తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ తాజాగా ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.318 కోట్ల నిధులను కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ నెల చివరినాటికి ప్రభుత్వం మహిళల కోసం ఈ చీరలను రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహిళలందరికీ దసరా పండుగ సందర్భంగా ఈ చీరలను పంపిణీ చేసే అవకాశం కనిపిస్తుంది.
ప్రభుత్వము ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు సాధికారత తో పాటు స్థానిక వస్త్ర పరిశ్రమను కూడా ప్రోత్సహించే విధంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన సమయం నుంచి మహిళలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను చేపట్టింది. మహిళలకు తక్కువ వడ్డీలకు రుణాలను కూడా అందించింది. అలాగే మహిళలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించే విధంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులైన 65 లక్షల మంది మహిళలకు ఈ చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చీరలను ప్రభుత్వం సిద్ధం చేసే విధంగా పూర్తి చర్యలను చేపట్టింది. దీంతో మహిళలకు దసరా పండుగ సందర్భంగా ఈ చీరలు ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.