Telangana Agriculture: ప్రభుత్వం ఈ ఏడాదిన్నర వ్యవధిలో వ్యవసాయ రంగం మరియు రైతుల సంక్షేమానికి సంబంధించి భారీగా నిధులను విడుదల చేసినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను చేపట్టిన సమయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల కోసం అనేక పథకాలకు 1.04 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అలాగే సన్నాల బోనస్, ధాన్యం కొనుగోలు చేసినందుకు ప్రభుత్వం 43 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ వానాకాలంలో రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా తో మొత్తం 21 వేల కోట్ల పెట్టుబడి సాయంతో ప్రభుత్వం కొత్త రికార్డును నెలకొల్పినట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.20616 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు కూడా చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ప్రభుత్వం రైతు రాజ్యం పేరుతో గత 18 నెలల నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధుల వ్యయం వివరాలను ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా అతి తక్కువ సమయంలో రైతుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని తెలిపింది. గతంలో రైతుల రుణమాఫీ కోసం లక్ష రూపాయల రుణమాఫీకి 4,5 విడతలుగా నిధులను విడుదల చేసేవారు. అటువంటి సమయంలో వడ్డీ భారం రైతులపై బాగా పడేది.
అప్పట్లో పదేళ్లు అయినా కూడా రైతుల అప్పులు తీరలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగింది. అలాగే 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తులను కూడా ప్రభుత్వం చేసినట్లు తెలిపింది. రైతు భరోసా సొమ్మును ఈనెల 16వ తేదీ నుంచి ఐదు రోజులలో మొత్తం 65.12 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7,310.59 కోర్టులో జమ చేసినట్లు తెలిపింది.