Electric Scooter: మార్కెట్లో అత్యాధునిక ఎలక్ట్రికల్ స్కూటీల వాడకం రోజురోజుకీ పెరుగుపోతున్న తరుణంలో బజాజ్ కంపెనీ వినియోగదారులకు ఎప్పుడు కూడా సరికొత్త మోడల్ ను అందిస్తుంది. వినియోగదారుల అభిరుచికి తగిన విదంగా స్కూటర్ లను అందుబాటులో తయారు చేస్తుంది. తాజాగా బజాజ్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో పెట్టింది. మైలేజ్ కూడా ఊహించని విధంగా ఉంది. ధర కూడా భారీగా లేదు…. ఆ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
3001 ఫీచర్ తో బజాజ్ స్కూటర్ మార్కెట్ లో ఉంది. 2903 మోడల్ కు అప్ గ్రేడ్ చేసిన స్కూటర్. ఎక్స్ షో రూమ్ ధర రూ : 99,990 గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ సో రూమ్ లల్లో అందుబాటులో ఉన్నవి. ఒక్కరు లేదంటే కుటుంబ పరంగా కూడా నడపడానికి ఈ సరికొత్త స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది. 35 లీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. పూర్తిగా ఐరన్ తో తయారు చేయబడిన బాడీ.
ఆటో-ఫ్లాషింగ్ స్టాప్ లాంప్, మ్యూజిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, గైడ్ మీ హోమ్’ లైట్ ఫీచర్, రివర్స్ లైట్, వంటి ఆప్షన్లు వినియోగ దారులకు అందుబాటులో ఉన్నవి. ఒక్క సారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 127 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. బ్యాటరీ కెపాసిటీ 3.0kWh. ఫ్లోర్బోర్డ్పై బ్యాటరీ ఉంటుంది. స్టోరేజ్ కూడా కుటుంబానికి సరిపడేంత తయారు చేయబడింది. ఈ స్కూటర్ లో 750W ఛార్జర్ ఉంటుంది. మూడు గంటల యాబై నిమిషాల్లో ఎనబై శాతం పైబడి ఛార్జింగ్ అవుతుంది. క్విక్-ఛార్జింగ్ సపోర్టు తో స్కూటర్ ను కంపెనీ తయారు చేయడం విశేషం.