Todays Gold Rate: గత వారం రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ బంగారం ప్రియులకు కాస్త ఊరట కలిగించిన బంగారం ధరలు మళ్ళీ నిన్నటి నుంచి పెరుగుతున్నాయి. ఆల్ టైం హై రికార్డ్ వైపు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం రోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర ఏకంగా రూ.99 వేలుగా నమోదయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం కొనుగోలు పెరిగిన గ్రామంలో మన దేశ మార్కెట్లో కూడా పసిడి కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. పసిడి పై పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి ఇది మంచి సమయం.
ఈరోజు మన దేశ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. ఆషాడ మాసం పండుగలు సీజన్ కారణంగా అలాగే త్వరలో శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ వస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతూ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ ఇస్తున్నాయి. జూన్ నెల చివరిలో వరుసగా తగ్గిన బంగారం ధరలు జులై మొదటి రోజు నుంచి మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. మనదేశంలో ఉన్న పలు ముఖ్య పట్టణాలు ముంబై, చెన్నై, కోల్కత్తా, బెంగళూరు లో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,900, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,660 గా ఉంది. ఈ నగరాలలో కిలో వెండి ధర రూ.1,20,100 గా ఉంది. ఢిల్లీ నగరంలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,050, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రు.90,810, కిలో వెండి ధర రు.1,09,900 గా నమోదయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్యమైన పట్టణాలు అయినా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్ మరియు ప్రొద్దుటూరులో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,900, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,660, కిల వెండి ధర రూ.1,19,900 గా ఉన్నాయని సమాచారం.