Weekly Horoscope: వీరికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.. ఈవారం 12 రాశుల వార ఫలాలు ఇవే

Weekly Horoscope
Weekly Horoscope

Weekly Horoscope: జూన్ 22, 2025 నుంచి జూన్ 28 2025 వరకు మేష రాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: శుభ పరిణామాలు జరుగుతాయి. ఉద్యోగంలో సమర్ధతకు తగిన గుర్తింపు ఉంటుంది. ఈ వారంలో శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ వహిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితుల్లో సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: సంపాదించిన దానిలో ఎక్కువ భాగం విలాసాల మీద ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాలనే జాగ్రత్త వహించాలి. మిత్రుల వలన ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో సమయం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు వ్యాపారంలో రాబడి బాగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరి అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. షేర్లు స్పెక్యులేషన్లలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది.

మిధున రాశి: ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. అనేక ఆదాయ మార్గాలు పొందుతారు. పెట్టుబడులలో మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

కర్కాటక రాశి: ఉద్యోగంలో శుభపరిణామాలు వింటారు. ఉద్యోగంలో డిమాండ్ తో పాటు రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ప్రముఖులతో ఉన్న పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది.

సింహరాశి: అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న వారికి ఉద్యోగం వస్తుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ప్రముఖులతో ఉన్న పరిచయాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. వ్యాపారంలో తక్కువ శ్రమ ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

కన్య రాశి: ఉద్యోగంలో శుభపరిణామాలు వింటారు. అనుమతిని తగ్గుతుంది. హోదా పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతాయి. షేర్లు స్పెక్యులేషన్ ల వలన ఆదాయం పెరుగుతుంది. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లలు పురోగతి సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

తులారాశి: ఈ వారం ప్రారంభం ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారం అనుకూలంగా ఉంటుంది అలాగే పెళ్లి సంబంధం కుదురుతుంది. కానీ 26 తర్వాత నుంచి బాగా కష్టపడాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో అపార్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి: ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామాలు వింటారు. పదోన్నతి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో స్థిరత్వం పొందుతారు. వ్యాపారంలో బాగా లాభాలు పొందుతారు. సొంత ఊర్లోనే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆదాయం బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక విషయాలకు దూరంగా ఉండాలి. విదేశాల నుంచి కొత్త అవకాశాలు వస్తాయి.

ధనస్సు రాశి: ఉద్యోగంలో ప్రాధాన్యత ఉంటుంది. పదోన్నతి ఉంటుంది. ఆదాయం మరియు ఆరోగ్యం బాగుంటాయి. ఆర్థిక విషయాలకు ఇది అనుకూల సమయం. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి: ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. అనేక ఆదాయం మార్గాలు కలుగుతాయి. ప్రయాణాల కారణంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం మీద సరదా వహించాలి. ఇంట బయట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. బంధువులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

కుంభరాశి: ఆదాయ ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు ఉండవు. రావలసిన డబ్బులు రాక ఇబ్బంది పడతారు. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మిత్రుల వలన కొంచెం ఇబ్బంది పడతారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది కానీ అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నిరుద్యోగులకు ఇది అనుకూల సమయం.

మీన రాశి: కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు తీరిపోతాయి. పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి తగిన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి మరియు ఉద్యోగ ప్రయత్నాలలో కూడా ఈ వారం శుభవార్తలు వింటారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now