BC: బీసీ జాబితాలో ఈ 26 కులాలు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

BC
BC

BC: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఇటీవలే రాష్ట్ర బీసీ జాబితా నుండి ఇప్పటికే తొలగించిన 26 కులాలపై మళ్ళీ బహిరంగ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చైర్మన్ జి నిరంజన్ తో కలిపి కమిషన్ సభ్యులు మరియు 64 ప్రతినిధులు బృందాలను విచారించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొందెర, శెట్టిబలిజ, కొప్పుల వెలమ, పులి నాటి వెలమ, కళింగ వంటి కులాల ప్రతినిధులందరూ తమను తిరిగి మళ్లీ బీసీ జాబితాలో చేర్చాలి అని కోరారు. బిసి ఏ గ్రూపులో ఇప్పటికే ఉన్న ఇతర కులాలు వీటిని వ్యతిరేకించారు. ముఖ్యంగా సామాజిక న్యాయానికి మరియు రిజర్వేషన్ల విధానానికి సంబంధించిన సవాళ్లను ఈ ప్రక్రియ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలపై ఇటీవల బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో విచారణ ప్రక్రియ చేపట్టడంతో సామాజిక న్యాయం మరియు రిజర్వేషన్ల అంశంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి కొన్ని కులాలను తొలగించిన విషయంలో ఇటీవల బహిరంగ విచారణను నిర్వహించింది. బీసీ కమిషన్ నిర్వహించిన ఈ విచారణలో బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాష్, బాలలక్ష్మి రంగు, డిప్యూటీ డైరెక్టర్ యు శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జి సతీష్ కుమార్ మరియు రీసెర్చ్ ఆఫీసర్ జి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది.

కమిషన్ వివిధ వర్గాల వాదనలను విన్న తర్వాత దీనికి ఒక సుదీర్ఘ నివేదిక రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషన్ బహిరంగ విచారణలో మొత్తం 64 ప్రతినిధుల బృందాల వాదనలను పరిశీలించింది. 133 బృందాలను మొత్తం మూడు రోజులలో కమిషన్ విచారించింది. ఈ బహిరంగ సమావేశంలో బృందాలతో వివిధ కులాల సామాజిక, ఆర్థిక మరియు విద్యాస్థితిగతులు అలాగే రిజర్వేషన్ల వల్ల వాళ్లకి కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి చర్చలు జరిగాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now