AI: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కనిపిస్తుంది. ప్రపంచ గమనాన్ని ఇది మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం అన్ని రంగాలలో కూడా దీని ప్రభావం బాగా కనిపిస్తుంది. కీలక రంగాలలో కూడా ఏఐ విస్తరించింది. అయితే రాబోయే భవిష్యత్తు కూడా ఏఐతో ముడిపడి ఉందనే సంకేతాలు బాగా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో ఏఐ కోర్సులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రముఖ సంస్థలు కూడా రానున్న రోజులలో ఏఐ కోర్సులలో లక్షలలో జీతాలు ఖాయమని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఏఐకు సంబంధించి ఐదు కోర్సులకు ప్రస్తుతం ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని రంగాలలో కూడా ఏఐ టెక్నాలజీ విస్తరించింది. విద్య, వైద్యం అలాగే వ్యాపార రంగాలలో కూడా ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉండడం ఖాయం అని తెలుస్తుంది. ఏఐ ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మార్కెట్లో ఈ కోర్సులకు కూడా జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏఐ రంగంలో ఉన్న ఈ ఐదు కోర్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏఐలో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్లకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.
ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్ వాహనాలు, ఆరోగ్య సంరక్షణ, అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా వీటి విస్తరణ బాగా పెరుగుతుంది. వీళ్లకు భారీ వేతనాలు కూడా ప్రముఖ కంపెనీలో ఆఫర్ చేస్తున్నాయి. రోబోటిక్ ఇంజనీర్ కోర్సుకు కూడా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. అలాగే డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. మార్కెటింగ్ తో పాటు సేవా రంగాలలో కూడా వీటికి బాగా డిమాండ్ ఉంది. డిమాండ్‌కు తగినట్లుగానే వేతనాలు కూడా ఆఫర్ చేస్తున్నారు.