Chanakya Niti: ఒక మనిషి విజయం సాధించడానికి ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రం బాగా ఉపయోగపడుతుంది. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు సూచించిన దాని ప్రకారం కొన్ని సూత్రాలను పాటిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. మనదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఆచార్య చాణిక్యుడు కూడా ఒకరు. ఈయన రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటి ప్రజలు కూడా చాలామంది ఫాలో అయ్యి జీవితంలో విజయం సొంతం చేసుకుంటున్నారు. చాణిక్యుడి అభిప్రాయాలు మరియు సలహాలు కాలాతీతంగా పనిచేస్తాయి. ఇప్పటి వారికి కూడా అవి బాగా ఉపయోగపడుతున్నాయి.
జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన నియమాలు బాగా ఉపయోగపడతాయి. నీతి శాస్త్రంలో ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరు కూడా చాలా నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లను ముందుకు నరికేస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. పొంగిన చెట్లు మాత్రమే చాలా కాలం వరకు జీవిస్తాయి. ప్రతి స్నేహం వెనుక కూడా స్వార్థం ఉంటుంది అన్న సంగతి తెలుసుకోవాలి. ఒకవేళ మా స్నేహంలో స్వార్థం లేదని ఎవరైనా మీకు చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అని గ్రహించాలి. మీరు ఏదైనా ఒక ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించే ముందు మీకు మీరు మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి.
Also Read: ఈ నియమాలు పాటిస్తే.. మీరు త్వరలో ధనవంతులు కావడం ఖాయం.. ఆచార్య చాణిక్య
నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, దీనివలన ఫలితం ఎలా ఉంటుంది అలాగే ఇందులో నేను విజయం సాధిస్తానా అనే మూడు ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానం దొరికినట్లైతే ఆ ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రపంచంలో స్త్రీ యొక్క యవ్వనం, అందం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు. మీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు అది వైఫల్యంతో ముగుస్తుంది అని భావించినట్లయితే మీరు ఎప్పటికీ వెనక్కి తగ్గకండి. కష్టపడి పనిచేసే వాళ్లు మాత్రమే జీవితంలో సంతోషంగా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి.