Ration Card: ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నెల కూడా రేషన్ కార్డు ఉన్నవాళ్లకి నిరాశ తప్పదు. ఈ నెల కూడా రేషన్ కార్డు వినియోగదారులకు కందిపప్పు దక్కదు అని తెలుస్తుంది. గత కొన్ని నెలల నుంచి కందిపప్పు ఉంటుంది అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారికి ఈ నెల కూడా నిరాశ తప్పదు అని తెలుస్తుంది. గతంలో బియ్యంతో పాటు రేషన్ షాపులో కందిపప్పు అలాగే చక్కెర కూడా ఇచ్చేవారు.
కానీ మార్చి నెల నుంచి ఈ ఏడాది కందిపప్పు సరఫరా రేషన్ కార్డుదారులకు నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులందరూ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో నిత్యవసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కందిపప్పు ప్రభుత్వ రేషన్లో దొరకకపోవడంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది.అయితే ప్రతినెలా బియ్యంతో పాటు చక్కెర సరఫరా కూడా జరుగుతున్న నేపథ్యంలో కందిపప్పు కూడా వస్తుందో లేదో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కందిపప్పు లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దీనిని ప్రభుత్వ రేషన్లో అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ జులై నెలలో కూడా బియ్యంతో పాటు చక్కెర మాత్రమే రేషన్ దుకాణాలలో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్లో కందిపప్పు ధరలు భారీగా ఉండడంతో సామాన్య ప్రజలు పోషకాహారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి రేషన్ దుకాణాలలో ప్రతినెలా కందిపప్పు అందించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం చక్కెరలతో పాటు కందిపప్పు కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకు సరఫరా చేసేవారు.