Chanakya Niti: కొంతమంది ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా కూడా అసలు టెన్షన్ పడరు. వాటిని ఎంతో తేలికగా భావించి తెలివిగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. మరి కొంతమంది మాత్రం చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చాలా భయాందోళనలకు గురవుతారు. ఆచార్య చాణిక్యుడు గొప్ప వ్యూహకర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. మన దేశ రాజకీయాలు మరియు చరిత్ర దిశను మార్చడంలో ఈయన చాలా కీలకపాత్ర పోషించారు. జీవిత కాలంలో ఆచార్య చాణుక్యుడు విధాన సలహాదారుడిగా, వ్యూహ కర్తగా, రాజకీయవేత్తగా, రచయితగా ప్రసిద్ధి చెందారు. అప్పట్లో మానవ స్వభావం గురించి ఆయన చెప్పిన అనేక సిద్ధాంతాలు ఇప్పటి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా మారాయి. మౌర్యుల పాలనా కాలంలో ఆచార్య చాణుకుడిని చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు.
ఆచార్య చాణిక్యుడు మనిషి జీవితానికి సంబంధించి ఎన్నో నీతి సూత్రాలను నీతి శాస్త్రంలో రచించారు. మనకు జ్ఞాన సాంప్రదాయంలో చాణిక్యుడికి చాలా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. అయినా వేదాలు మరియు పురాణాల గురించి బాగా తెలిసినవాడుగా ప్రసిద్ధి చెందాడు. మనుషులు కష్టాలలో ఉన్న సమయంలో ఎలా మసులుకోవాలి అనే దానిపై కూడా ఆయన నీతి శాస్త్రంలో ప్రస్తావించారు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమయంలో కష్టాలు తప్పవు. అటువంటి సమయంలో తనదైన శైలీలో మనిషి ఆ కష్టాలను పరిష్కరించుకోవడానికి సిద్ధపడతాడు. కొంతమంది ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా కూడా టెన్షన్ పడరు. వాటిని చాలా తేలికగా పరిష్కరించుకుంటారు.
మరి కొంతమంది మాత్రం చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా టెన్షన్ పడతారు. కష్టాలను ఎదురుకోలేక తమని తాము అసమర్థులుగా కూడా భావిస్తారు. ఏ వ్యక్తికైనా కష్టాలు ఎదురైనప్పుడు ఒక పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. కష్టాలు వచ్చిన సమయంలో ముందుగానే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా సహనంతో, ఓపికగా ఉండాలి. కష్ట సమయాల్లో కూడా కుటుంబం పట్ల పూర్తి బాధ్యతను నెరవేర్చాలి. డబ్బును ఆదా చేస్తూ ఉండాలి. మీకు ఆపద వచ్చిన సమయాలలో మీరు ఆదా చేసిన డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది.