Chanakya Niti: గొప్ప వ్యూహకర్త అయిన ఆచార్య చాణిక్యుడు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచార్య చాణిక్యుడు నీతి సంవత్సరంలో మనకు ఎంతో అవసరమైన అనేక నియమాలు ఉన్నాయి. మనము ఆనందంగా జీవించాలి అన్న అలాగే జీవితంలో విజయం సాధించాలి అన్నా కూడా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తే సరిపోతుంది. ఆచార్య చాణిక్యుడు ఎన్నో పుస్తకాలను రాశారు. అందులో నీతి శాస్త్రం పుస్తకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితానికి సంబంధించి నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన అనేక విషయాలను ఇప్పటి ప్రజలు కూడా చాలామంది ఆచరించి జీవితంలో విజయం సాధిస్తున్నారు.
జీవితంలో ఏర్పడే ప్రతి ఒక్క సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం గురించి నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు వివరించాడు. మనిషి సంతోషంగా ఉండడానికి ఈ నియమాలు చాలా ఉపయోగపడతాయి. ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మనల్ని ఎల్లప్పుడు దూషించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు మీలో ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఇటువంటి వారితో కలిసి ఉండటం వలన ఎల్లప్పుడూ దుఃఖంతో ఉండాలి. వారు మిమ్మల్ని ఆనంద పెట్టలేరు. అలాగే మూర్ఖులతో కూడా కలిసి జీవించకూడదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు.
ఏ విషయం గురించి అయినా మూర్ఖులకు వివరించే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేయడం వలన మీ విలువైన సమయం వృధా అవుతుంది. మూర్ఖులు ఎవరి మాట వినడానికి ఇష్టపడరు. కాబట్టి అటువంటి వారితో కలిసి ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉండలేరు. అలాగే చెడు ఆలోచనలు కలిగిన స్త్రీలతో కూడా దూరంగా ఉండాలి. ఇటువంటి వారి వలన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ జీవితంలో అనేక ఇబ్బందులు కలిగిస్తారు. కాబట్టి చెడు ఆలోచనలు కలిగి ఉన్న స్త్రీలకు దూరంగా ఉండడం మంచిది.