Credit Score: క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. మీరు ఇవి పాటించక తప్పదు

Credit Score
Credit Score

Credit Score: ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో క్రెడిట్ స్కోర్ కు సంబంధించి చాలా తప్పుడు సమాచారం వైరల్ అవుతుంది. కొంతమంది సామాజిక మాధ్యమాల సలహాల ఆధారంగా అలాగే కుటుంబ సభ్యులు లేదా మిత్రుల కారణంగా కొన్ని పొరపాటు ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా అనేక మానసిక ఒత్తిడి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండడం అలాగే రుణం తీసుకున్న తర్వాత దానిని తిరిగి సకాలంలో చెల్లించకపోవడం వంటివి క్రెడిట్ స్కోర్ ను దెబ్బతీస్తాయని చెబుతారు.

కానీ నిజంగా మీ క్రెడిట్ స్కోర్ ను ఏ విషయాలు ప్రభావితం చేస్తాయా ముందుగా మీరు తెలుసుకుంటే దానినిబట్టి మీరు సరైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవచ్చు. కొంతమంది క్రెడిట్ స్కోర్ తగ్గకూడదు అనే ఉద్దేశంతో క్రెడిట్ రిపోర్ట్ చూడడం ఆపేస్తారు. కానీ మీ సొంత క్రెడిట్ రిపోర్టు చూసినప్పుడు దానిని సాఫ్ట్ ఎంక్వయిరీ అంటారు. ఇలా మీరు చెక్ చేయడం వలన మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తినదు. ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వలన మీరు అందులో ఉన్న తప్పులను గుర్తించవచ్చు. ఎవరైనా మన ఐడీలను ఉపయోగించి వాటిపై రుణం తీసుకుంటే వాటిని సులభంగా తెలుసుకోవచ్చు.

అయితే క్రెడిట్ కార్డుకు సంబంధించి హార్డ్ ఎంక్వైరీ చేసినప్పుడు మాత్రమే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు రుణం కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులో మీకు క్రెడిట్ రిపోర్ట్ ను చెక్ చేయడానికి ఆడ్ ఎంక్వైరీ చేస్తారు. ఈ విధంగా చేసినప్పుడు ఎక్కువగా ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మీ స్కోర్ తగ్గుతుంది. అలాగే మీరు బ్యాంకులలో ఎక్కువగా పొదుపు ఖాతాలు లేదా చెకింగ్ ఖాతాలు పెట్టుకోవడం కూడా క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేయదు. బ్యాంకులలో రుణాలు అలాగే క్రెడిట్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా క్రెడిట్ స్కోరులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అయితే బ్యాంకులో ఎన్ని ఖాతాలు ఉన్నా పర్వాలేదు కానీ వాటిలో ఉండే డబ్బులు మాత్రం ఎలా వాడుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now