Today Gold Rate: ఆల్ టైం రికార్డుకు పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంత అంటే..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా గత కొన్ని రోజుల నుంచి బంగారం పెరుగుతూనే ఉంది. మనదేశంలో లైవ్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర ఇప్పటికే లక్ష రూపాయలు దాటింది. అలాగే ఈరోజు రిటైల్ మార్కెట్లో కూడా లక్ష మార్కు దాటే అవకాశం కనిపిస్తుంది. లక్ష రూపాయల మార్క్ దాటడానికి పసిడి ధర కేవలం 500 రూపాయల దూరంలోనే ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.99,500 కు చేరుకుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితుల కారణం గా మనదేశంలో పసిడి ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగానే మనదేశంలో పసిడి ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దూకుడు మీదుంది. ఇప్పటికే పసిడి ధర 3450 డాలర్ల మార్క్ ఔన్స్ ను దాటింది.
ప్రస్తుతం లక్ష మార్కు దాటినా కూడా పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే మరోవైపు యుఎస్ ఫెడ్ పై ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఫెడ్ స్వతంత్రతకు భంగం కలుగుతుందని ఆందోళనలు జరుగుతున్నాయి. ఫేడ్ పై ట్రంప్ ఒత్తిడితో పసిడి ప్రియులు ఎన్నడూ చూడలేని బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు టాక్స్ లతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. బంగారం ధరలు ఈ విధంగా అడ్డగోలుగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు విలవిల పోతున్నారు. పసిడి లకారం అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఆడపిల్ల ఉన్న ఇంట్లో పెళ్లి ఎలా చేయాలి అంటూ జనం వాపోతున్నారు. ప్రస్తుతం పసిడి లక్ష రూపాయలు దాటడంతో భవిష్యత్తులో కొనుగోళము లేదో అంటూ ఆందోళన చెందుతున్నారు. అలాగే మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్ల పెళ్లిళ్లకు బంగారం కొనడం ఇక కలగా మిగిలిపోతుంది ఏమో అంటూ రాబోతున్నారు. అయితే పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.