Todays Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇలా..

Todays Gold Rates
Todays Gold Rates

Todays Gold Rate: త్వరలో రానున్న శ్రావణమాసానికల్లా బంగారం ధరలు ఆకాశం వైపు కాకుండా నేల వైపు చూస్తాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో ఆందోళన కలిగించేవి. కానీ ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశ మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ మరి ఏ ఇతర దేశాల్లో ఉండదనేది నగ్నసత్యం. ఏ శుభకార్యానికైనా ముందుగా పసిడితో కొనుగోలు చేసి మిగతా కార్యక్రమాలు ప్రారంభించడం శుభసూచికగా భావిస్తుంటారు. అలాంటి బంగారం ధరలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అందనంత ఎత్తులో ఆకాశం వైపు బంగారం ధరలు పెరిగిపోతుండడం సామాన్యులకు నిరాశనే మిగిల్చాయి. కానీ రానున్న శ్రావణమాసంలోనైనా బంగారం ధరలు నేలపైకి దిగివస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆశలకు తగ్గట్టుగా మంగళవారం పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పసిడి ప్రియుల్లో ఆశలు చిగురించాయి. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..

Also Read: బంగారం ధరల దోబూచులాట.. ఈరోజు బంగారం ధరలు

ప్రధాన నగరాలలో 10 గ్రాముల బంగారం ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి..

నగరం.          24 క్యారెట్లు      22 క్యారెట్లు      18 క్యారెట్లు

హైదరాబాద్   రూ. 99770/-  రూ. 91450/-   రూ. 74830/-

అహ్మదాబాద్  రూ. 99820/-  రూ. 91500/-   రూ. 74870/-

చెన్నై       రూ. 99770/-     రూ. 91450/-    రూ. 75350/-

ఢిల్లీ         రూ. 99920/-     రూ. 91600/-   రూ. 74950/-

ముంబై     రూ. 99770/-    రూ. 91450/-     రూ. 74830/-

విజయవాడ రూ. 99770/-  రూ. 91450/-   రూ. 74830/-

విశాఖపట్నం రూ. 99770/- రూ. 91450/-  రూ. 74830/-

Also Read:బంగారం ధరలు అమాంతం జంప్..

ఈరోజు ఈ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉదయం 11 గంటల వరకు నమోదైన పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now