Todays Gold Rate: గోల్డ్ లవర్స్ కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
మనదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఏ చిన్న శుభకార్యం జరిగిన కూడా ముందుగా బంగారం కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో చాలామంది ప్రతిరోజూ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న బంగారం ధరలను గమనిస్తూ ఉంటారు. మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బంగారం ధరలు పెరిగినా లేదా తగ్గినా కూడా మార్కెట్లో మాత్రం వాటి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా మన దేశ మార్కెట్లో ఉన్న బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు స్వల్పంలో తగ్గినట్లు సమాచారం. జూన్ 9వ తేదీ బంగారం ధరలపై పది రూపాయలు తగ్గింది. గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. మళ్లీ బంగారం ధరలు తగ్గుతూ క్రమక్రమంగా దిగి వస్తున్నాయి. మళ్లీ తాజాగా బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ప్రస్తుతం స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.97,960, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,790 గా ఉంది.
ఇక దేశంలో పలు ప్రధాన నగరాలు చెన్నై, ముంబై, హైదరాబాద్ మరియు విజయవాడ వంటి నగరాలలో ఈరోజు తులం స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ.97,960, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.89,790 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.98,110, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.89,940 గా ఉంది. ఇక ఈరోజు కిలో వెండి ధరపై 100 రూపాయలు తగ్గినట్లు తెలుస్తుంది. ఈరోజు దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.1,06,900 ఉందని సమాచారం.