Todays Gold Rate: బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. లక్ష రూపాయలు పైనే ఉన్న బంగారం ధరల్లో (GOLD RATES) భారీగానే మార్పులు చోటు చేసుకోవడంతో పసిడి ప్రియులు బంగారం కొనే దిశగా ఆసక్తి చూపుతారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెండ్లీల సీజన్ (MARRIAGE SEASON) కావడంతో బంగారం కొనుగోలు చేయక తప్పని పరిస్థితుల్లో బంగారంపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మరికొంతమంది బంగారం ధరలు నేలకు దిగివస్తాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ముచ్చటపడి ఏదైనా బంగారంతో వస్తువు చేయించుకోవాలంటే ప్రస్తుతం మధ్యతరగతి (MIDDLE CLASS FAMILY) వారు లక్ష రూపాయలు ధర ఉండటంతో బంగారం కొనుగోలు చేసే పరిస్థితి అసలే కనబడడం లేదు. దీంతో చేసేది లేక బంగారం ధరలు దిగివచ్చినాకే (DOWN) ముచ్చట తీర్చుకోవాలని మధ్యతరగతి కుటుంబాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటితో పసిడి ధరలు పోల్చుకుంటే 10 గ్రాముల పసిడికి 880 రూపాయల నుండి 1000 పైల వరకు ధరలు తగ్గినట్లుగా కనబడుతున్నాయి. (ఆగస్టు 12 2025) నేటి ధరలు ఇలా ఉన్నాయి.
Also Read: ఇంట్లో ఈ మొక్క ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
ప్రధాన నగరాలలో బంగారం ధరలు 10 గ్రాములకు..
నగరం. 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు
హైదరాబాద్ రూ. 1,01,400/- రూ. 92,950/- రూ. 76,050/-
అహ్మదాబాద్ రూ. 1,01,450/- రూ. 93,800/- రూ. 76,090/-
చెన్నై రూ. 1,02,400/- రూ. 92,950/- రూ. 76,750/-
ఢిల్లీ రూ. 1,01,550/- రూ. 93,100/- రూ. 76,180/-
ముంబై రూ. 1,01,400/- రూ. 92,950/- రూ. 76,050/-
విజయవాడ రూ. 1,01,400/- రూ. 92,950/- రూ. 76,050/-
విశాఖపట్నం రూ. 1,01,400/- రూ. 92,950/- రూ. 76,050/-
Also Read: ఇంట్లో వారికి ఈ అలవాట్లు ఉంటే.. జీవితాంతం పేదరికమే.. ఆచార్య చాణిక్యుడు
నిన్నటితో ఈరోజు బంగారం ధరలను పోల్చి చూస్తే ఇంకా కాస్త తగ్గుముఖం పట్టాయి. సుమారుగా 1000 రూపాయల వరకు ధరలు తగ్గాయి. పసిడి ధరలు కాస్త తగడంతో ఆగస్టు 12 2025 నాటి 10 గం. వరకు పసిడి ధరలు.