Toll Plaza: టోల్ థాట్స్.. ఇకపై వారికి కూడా టోల్ ట్యాక్స్ పడనుందా..? టూ వీలర్ వాహనదారులకు బ్యాడ్ న్యూస్..
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్కమ్ సోర్స్ పెంచుకునే మార్గంలో టోల్ థాట్స్.. ఆలోచనలో భాగంగా ఈ విధంగా టాక్స్ వసూలు చేసి ద్విచక్ర వాహనాల వద్ద కూడా టోల్ టాక్స్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో గడిచిన రెండు రోజులుగా వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో టూ వీలర్ వాహనదారులు తమ జేబుల్లోంచి టోల్ ప్లాజా వద్ద టోల్ టాక్స్ కట్టక తప్పదు అన్న సందిగ్ధంలో పడ్డారు. దీంతో టోల్ ప్లాజా ల వద్ద ఇప్పటివరకు రయ్యుమని వెళ్లిన 2 వీలర్ వాహనదారులకు ఈ వార్త ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినట్లయింది.
ఇది ఒక విధంగా వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కానీ ఇదివరకైతే కేంద్ర మంత్రి నితిన్ ఘట్కారి ఎక్కడ కూడా టూవీలర్ వాహనదారుల వద్ద టోల్ ప్లాజాలలో టోల్ టాక్స్ వసూలు చేయాలని అధికారిగా ప్రకటన చేయలేదు. ఎక్కడ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ద్విచక్ర వాహనదారుల వద్ద టోల్ ప్లాజా లలో టాక్స్ తీసుకుంటామని చెప్పనప్పటికీ, జూలై 15 నుండి ద్విచక్ర వాహనదారుల వద్ద మినిమం ఛార్జ్ రూపంలో టోల్ వసూలు చేయాలని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు చేస్తున్న విషయం విధితమే. ఏది ఏమైనా టోల్ ప్లాజా ల వద్ద టూవీలర్లు నడిపే వారికి టాక్స్ వసూలు చేస్తే వారి జేబులకు చిల్లులు పడడం ఖాయం. గమనిక: ఈ వార్త కేవలం సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా, మా వెబ్ సైట్ పాఠకుల కోసం ముందస్తు సూచికగా తెలియజేయడానికి రాసిన కథనం మాత్రమే.