Donald Trump: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఎన్నారై లకు అక్కడి ప్రభుత్వం గొప్ప శుభ వార్త ప్రకటించింది. కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న విషయం తెలియడంతో భారతీయుల్లో ఆనన్దనమ్ వ్యక్తం అవుతోంది. రెమిటెన్స్ పన్నును అమెరికా ప్రభుత్వం సవరించడానికి సిద్ధమవుతోంది. ఈ పన్ను ను 3.5 నుంచి 1 శాతం కు తగ్గించారు. గతంలో 5 శాతం రెమిటెన్స్ పన్ను విధానం ఉండేది. ఆ తరువాత 3.5 శాతంకు సవరించారు.
ఇప్పుడు 3.5 శాతం నుంచి ఒక శాతం తగ్గడానికి అమెరికా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేస్తోంది. అంటే కొత్త చట్టం అమలయితే 2.5 శాతం మాత్రమే అక్కడి భారతీయులు రెమిటెన్స్ పన్ను చెల్లించాలి ఉంటుంది. రెమిటెన్స్ పన్ను విధానం ఎవరికీ మేలు చేస్తుంది అంటే. అమెరికా లో ఉండి ఉద్యోగం చేస్తున్న భారతీయులకు ఈ పన్ను విధానం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి ఇండియాకు డబ్బు పంపేవారికి పన్ను తగ్గించడంతో ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.
అమెరికా ప్రభుత్వం బ్యాంకు లు జారీ చేసిన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఇండియా లోని వారి కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వారికి ఈ కొత్త పన్ను విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త పన్ను విధానం ఈ ఏడాది డిసెంబర్ 31 తరువాత నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం అమెరికాలో భారత దేశ పౌరులు 29 లక్షల పైబడి నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త పన్ను విధానం వీరికి ఎంతో ఉపయోగమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.